Monday, December 17, 2012
cene sarigamalu
Movie: Parichay
© Hindisongs.net. All Rights Reserved.
Beete na bitaaii rainaa birahaa kii jaaii rainaa
Bhiigii huii ankhiyon ne laakh bujhaaii rainaa
Beete huii batiyaan koii doharaaye
Bhuule hue naamon se koii to bulaaye
Chaand chaand
Ho o
O chaand kii bin diivaanii, bin diivaanii ratiyaa
Jaagii huii ankhiyon men raat na aaii rainaa
Beete na bitaaii rainaa birahaa kii jaaii rainaa
Beete na bitaaii rainaa
Yug aate hain aur yug jaae
Chhotii chhotii yaadon ke
Pal nahiin jaae
Jhuuth se kaalii laage, laage kaalii ratiyaa
Ruuthii huiin ankhiyon ne laakh manaaii rainaa
Beete na bitaaii rainaa birahaa kii jaaii rainaa
Beete na bitaaii rainaa
© Hindisongs.net. All Rights Reserved.
Beete na bitaaii rainaa birahaa kii jaaii rainaa
Bhiigii huii ankhiyon ne laakh bujhaaii rainaa
Beete huii batiyaan koii doharaaye
Bhuule hue naamon se koii to bulaaye
Chaand chaand
Ho o
O chaand kii bin diivaanii, bin diivaanii ratiyaa
Jaagii huii ankhiyon men raat na aaii rainaa
Beete na bitaaii rainaa birahaa kii jaaii rainaa
Beete na bitaaii rainaa
Yug aate hain aur yug jaae
Chhotii chhotii yaadon ke
Pal nahiin jaae
Jhuuth se kaalii laage, laage kaalii ratiyaa
Ruuthii huiin ankhiyon ne laakh manaaii rainaa
Beete na bitaaii rainaa birahaa kii jaaii rainaa
Beete na bitaaii rainaa
Saturday, May 26, 2012
Rag Bilaval/sankarabharanam-model shifting
భారతీయ సంగీతం లో శంకరాభరణం ఒక ప్రాధమిక రాగం (Primordial scale). ఈ రాగాన్ని గ్రహ భేదం చేస్తే అంటే ఆ రాగం లో వచ్చ్చే రిషభం ,గాంధారం ,మధ్యమం ,పంచమం ,దైవతం ,నిషాదం ,స్వరాలని షడ్జమం గా చేస్తూ పాడితే(model shifting) వరుసగా కాఫీ ,భైరవి,యమన్ కళ్యాణ్ ,ఖమాజ్ ,అసావరి ,బహార్ రాగాలు వినిపిస్తాయి .
ఈ ప్రక్రియ సోదాహరణం గా మీకు తెలియజెయడానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ తాన్సేన్ చిత్రం కోసం స్వరపరచగా ప్రఖ్యాత గాయకుడు ఏసుదాస్ పాడిన ఒక master piece ` షడ జ్ నే పాయా యే వరదాన్ 'అనే పాట ని ఇక్కడ పొందుపరుస్తున్నాను విని ఆనందించండి .
మురళి
Thursday, March 15, 2012
`Queen of Raagaas'' ,`కల్యాణి'
కల్యాణి (యమన్)రాగరంజని
(ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక,ఆంధ్రజ్యోతి దినపత్రిక లలో నేను నిర్వహించిన 'రంజని' 'కళా జ్యోతి ' సాంస్కృతిక పేజీ లలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ వ్యాసాలు)
ఈ వ్యాసాలు ప్రచురించిన మంగు రాజ గోపాల రావు ,నండూరి రామ మోహన రావు గారికి ,నా కు సహకరించిన నా శ్రీమతి శ్రీ సుశీలకి క్ర్రుతజ్ఞతలు )
భారతీయ సంగీతంలో అతి ప్రాచీనమైనదీ ,విస్తృత ప్రచారంలో ఉన్నఅందమైన,అపురూపమైన రాగం కల్యాణి'. మన రాగాలలో `దర్బారీ కానడ'ని ``King of Raagaas'' అనీ ,`కల్యాణి' రాగాన్ని `Queen of Raagaas'' అనీ వ్యవహరిస్తారు .మాధుర్యానికి మరోపేరు కల్యాణి.అందుకే బాలమురళీకృష్ణ ఆయన స్వీయ రచన` ఓ కల్యాణి రాగిణీ' లో మాధుర్యం నీ సొత్తు అని పొగుడుతారు..హిందుస్తానీ సంగీత పధ్ధతి లో కల్యాణి స్త్రీ రాగం అంటే రాగిణి .(పురుష రాగాలని `రాగ' అని స్త్రీ రాగాలని `రాగిణి 'గా వ్యవహరిస్తారు).
కల్యాణి రాగం సంపూర్ణ రాగం (Septa tonic scale ).అంటే ఇందులో షడ్జమం ,చతుశ్రుతి రిషభం,అంతర గాంధారం ,ప్రతి మధ్యమం,పంచమం,చతుశ్రుతి దైవతం,కైశికి నిషాదం షడ్జమం అనే ఏడు స్వరాలు ఉంటాయి .ఇవన్నీ తీవ్ర స్వరాలు(షార్ప్ నోట్స్) .అందువల్లే ఈ రాగం వినటానికి శ్రావ్యంగా,హాయిగా వుంది మనసును త్వరితం గా రంజింప చేస్తుంది..ఈ రాగం కీర్తనలు,కృతులుతిల్లాన లు ,జావళీలు,పదాలు శ్లోకాలు,పద్యాలు,దండకాలు,భక్తి
సినిమాలలో మన సంగీత దర్శకులు అద్భుత మైన ప్రయోగాలు చేసి అన్నీ రకాల భావాలూ ఈ రాగంలో పలికించి ఈ రాగం యొక్క బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరింప చేసేరు.
ఈ రాగంలో స్వరపరచిన భక్తీ గీతాలు:
శ్రీ రామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి (పి.సుశీల)
సకల జగన్నివాసుడవు (క్రిష్ణమయ్య కీర్తన ) ని భిన్నమైన శైలిలో శ్రీ సుశీల స్వరపరచిన ది
అనుజుడై లక్ష్మణుడు (స్వరాభిషేకం-విద్యాసాగర్-ఏసుదాస్)
తులసీదాస్ భజన్ :
Sree Raama chandra kriered paalu bhaju manaharana bhava bhaya daarunam అనుజుడై లక్ష్మణుడు (స్వరాభిషేకం-విద్యాసాగర్-ఏసుదాస్)
తులసీదాస్ భజన్ :
music composed and rendered by Vinukonda Mrali
శృంగార గీతాలు :
నాట్య గీతాలు:
జోలపాట :
మెల్ల మెల్లగా చల్ల చల్ల గా రావే నిదురా హాయిగా (చక్రపాణి -భానుమతి )
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (దేవదాసు-సుబ్బరామన్-ఘటసాల)
పెళ్ళిచేసుకుని ఇల్లుకట్టుకుని (పెళ్ళిచేసిచూడు -సంగీతం ,గానం :ఘంటసాల)
రావే నా చెలియా (మంచి మనసుకు మంచి రోజుల్లు - సంగీతం,గానం :ఘంటసాల )(స్వచ్చమైన కల్యాణి కి ఒక మంచి ఉదాహరణ )
ఎవరివో నీవెవరివో (పునర్జన్మ-టి.వి.చలపతి రావు -ఘంటసాల)
బహుదూరపు బాటసారి (ప్రైవేటు రికార్డు -సగీతం,గానం :ఘంటసాల )
(మంచి కళ్యాణికి ఒక చక్కని ఉదాహరణ )
(మంచి కళ్యాణికి ఒక చక్కని ఉదాహరణ )
మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన (
యుగళ గీతాలు:
చెలికాడు నిన్నే రమ్మని పిలువా (కులగోత్రాలు -సాలూరు రాజేశ్వర రావు -ఘటసాల,సుశీల)
జగమే మారినది మధురముగా ఈవేళా...(దేశ ద్రోహులు-సాలూరు రాజేశ్వర రావు -ఘంటసాల,సుశీల)
చక్కని వాద్య గోష్టి తో ,మధురమైన కల్యాణి రాగంలో ఒక నిత్యవసంత గీతం ఇది.
హిందీ చిత్రాలలో యమన్/కల్యాణ్ 0రాగం లో బాగా పొపులర్ అయిన పాటలు :
తుమ్బిన్ జీవన్ కైసే బీతాన్ (అనిత-లక్ష్మికాంట్ ,ప్యారేలాల్ -ముకేష్)
(an excellent song from the composition and rendering view point)
(స్వచ్చమైన కల్యాణి రాగానికి ఒక మంచి ఉదాహరణ)
ఘజల్:
(a Gajal composed in typical pursianstyle of ragYaman)
విషాద గీతాలు :
మధ్యమ
,నిషాద స్వరాలకి ప్రాధాన్యత ఇస్తూ కంపిత స్వరాలుగా ప్రయోగించడం ద్వారా
,పంచమ ,షడ్జమాలని కొద్దిగా స్ప్రుసించడం ద్వారా కల్యాణి రాగంలో విషాద చాయలు
కల్పించవచ్చని పెద్దలు చెప్తారు.
మోహన్ ).ఈ రెండు పాటలూ మంచి` కల్యాణి 'కి ఉదాహరణలు.
పెను చీకటాయే లోకం (మాంగల్య బలం -మాస్టర్ వేణు-ఘంటసాల )
మై తేరే ప్యార్ క బీమార్ హూన్ క్యా అర్జ్ కరూన్ (లవ్ ఇన్ టోక్యో -శంకర్ జైకిషన్ -మన్నా డే)
మాణిక్య వీణాం ఉపలాలయన్తీం (sankaraabharanam)
పద్యం :
రంగారు బంగారు (లవకుశ-సంగీతం ,గానం -ఘంటసాల) ఈ పద్యం మంచి కల్యాణి కి ఉదాహరణ గా పేర్కొనవచ్చు
`సింధుభైరవి 'చిత్రం కోసం ఇలయ రాజా ప్రయోగాత్మకంగా ఒక్క ఆరోహణ స్వరాలనే ఉపయోగిస్తూ ` కల్యాణ యే''అనే ఒక చక్కని మెలోడి ని ఇచ్చారు
.సుప్రసిద్ధమైన ఒక ఇంగ్లీష్ పాటని తీసుకుని దానిని కల్యాణి రాగం లో స్వరబద్ధం చేసి రాక్,జాజ్ మిళితం చేసి మురళి కృష్ణ ప్రయోగాత్మకంగా రికార్డు చేసిన పాట ఇది
Sunday, March 11, 2012
సినీ సరిగమలు - హంసధ్వని -hamsadhwani
హంసధ్వని
ప్రపంచ సంగీత సంప్రదాయాలన్నింటి లోనూ భారతీయ సంగీతం చాలా విశిష్టమైంది.మనకున్న రాగసంపదే ఆ విశిష్టత కి కారణం .మన సంగీతానికి ఆత్మ రాగాలే!
(ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక,ఆంధ్రజ్యోతి దినపత్రిక లలో నేను నిర్వహిచిన సాంస్కృతిక పేజీలు 'రంజని'.'కళాజ్యోతి ' లలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ వ్యాసాలు.ఈ వ్యాసం ప్రచురించిన మంగు రాజగోపాల్ ,నండూరి రామ మోహన రావు గారు,సహకారం అందించిన నా శ్రీమతి శ్రీ సుశీలకి కృతజ్ఞతలు )
మనకి కలిగే సంతోషం,దుఖం బాధ,జాలి,విచారం ఇలా అన్నిమూడ్స్ వ్యక్తం చేయడానికి మన సంగీతం లో రాగాలు ఉన్నాయి.మనం వినే ప్రతీ సంగీత ప్రక్రియ శాస్త్రీయ సంగీతం కానీ ,సినీమా పాట గానీ ఏదో ఒక రాగం పై ఆధారపడి వుంటుంది.`గురు లేక ఎటువంటి గుణికి తెలియగ బోదు 'అనే త్యాగరాజ కీర్తనకి,`ఎదుట నీవే !ఎదలోన నీవే ' అనే సినిమాపాటకి ఆధారం `గౌరీ మనోహరి'అనే సంప్రాదాయిక రాగం అంటే మనకి ఆశ్చర్యం గా వుంటుంది.అంతెందుకు `రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ'అనే కీర్తన కీ` యమహా నగరి కలకత్తా పురీ'
అనే సినీమా పాటకీ ఆధారం `కదన కుతూహలం 'అనే రాగం ఆధారం.
ఇలా మనకి తెలిసిన ప్రతి సంప్రదాయిక సంగీత రచన,,సినిమా పాటా ఏదో ఒక రాగంపైన ఆధారపడి వుంటుంది.మనకి తెలియకుండానే ఎన్నో సంప్రదాయిక రాగాలు మనకి కీర్తనల ద్వారా సినిమా పాటల ద్వారా పరిచయమయ్యే వుంటాయి.
మ వాగ్గేయ కారులు,న చలన చిత్ర సంగీత దర్శకులు వారి మేధస్సుతో,సృజనాత్మకతని జోడించి సంప్రదాయిక రాగాలలో ఎన్నో మంచి మంచి,కీర్తనలు పాటలు సృష్టించి సంప్రదాయిక రాగాల బహుముఖ సౌందర్యాలని ఆవిష్కరించారు.అంతే కాదు ఎన్నెన్నో ప్రయోగాలు చేసి వాటికి కొత్త రూపాలిచ్చారు.
ఎక్కువ లోతులకి పోకుండా మన సంప్రదాయిక సంగీత రచనల్లో, సినిమా పాటలలో సంప్రదాయిక రాగాలగురించి చర్చించుకోవడమే ఈ శీర్షిక లక్ష్యం.
మన భారతీయ సంగీతంలో ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క స్వభావం వుంది .ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూడ్ ని సూచిస్తుంది .ఉదాహరణకి 'భూపాలం'ఉదయరాగం కావటంవల్ల సూర్యోదయాన్నిఆ రాగం సూచిస్తుంది .అలాగే హంసధ్వని రాగం ప్రారంభాన్ని సూచిస్తుంది .రాగల స్వభావాలని ,మూడ్స్ ని బట్టి ఆయా రాగాలలో పాటలని స్వరపరచే ఆచారంమనకి అనాదిగా వస్తోంది .
.దక్షిణాదిలోశాస్త్రీయ సంగీత కచేరీలని' హంసధ్వని'రాగంతో ప్రారంభించే ఆచారం వుంది.
(హంసధ్వని రాగం హిందుస్తానీ పధ్ధతి వాతాపిగణపతిం భజే హం కీర్తన)
(హంసధ్వని రాగం హిందుస్తానీ పద్ధతిలో)
ఈ రాగం ఆధునిక రాగాలకోవకి చెందినది .ముత్తుస్వామి దీక్షి తార్'తండ్రి రామస్వామి ఈ రాగాన్ని సృష్టించారని చెపుతారు .ప్రాచీన గ్రంధాలలో' హంసధ్వని ' రాగం గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు కనిపించదు.పర్షియా సంగీత సంప్రదాయానికి చెందిన రాగాన్నిరామ స్వామి దీక్షితార్ అడాప్ట్ చేసుకుని దక్షిణాది సంగీత సంప్రదాయానికి చెందిన ఇడియంస్ ,ఫ్రేజెస్ తో కీర్తనలని పాడారని చెపుతారు. హిందుస్థానీ సంగీతంలో హంసధ్వని ని పోలిన రాగం లేదు.దక్షిణాది లో పాడుతోన్న రాగాన్నే బండి బజార్ ఘరానా కి చెందిని ఉస్తాద్ అమన్ ఆలీఖాన్ ఉత్తరాది లో బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు .
హంసధ్వని రాగం 29 వ మేళకర్త ధీర శంకరాభరణం జన్యం ఇది ఔఢవ -ఔఢవ జాతికి చెందినది అంటే ఈ రాగం ఆరోహణ లోను అవరోహణ లోనూ ఐదేసి స్వరాలుంటాయి.
ఆరోహణ: స-రి-గ-ప-ని-స (షడ్జమం-చతుసృతి రిషభం-అంతర గాంధారం-పంచమం-కైసికి నిషాదం-షడ్జమం)
అవరోహణ: స-ని-ప-గ-రి-స (షడ్జమం-చతుసృతి రిషభం-అంతర గాంధారం-పంచమం-కైసికి నిషాదం-షడ్జమం)
ఈ రాగం భక్తి భావాన్ని వ్యక్తీకరిస్తుంది.కానీ చలన చిత్రసంగీతం లో ప్రయోగాత్మకంగా,జావళీలు,సోలో లు, యుగళ గీతాలు కూడా స్వరపరచారు.
హంసధ్వని రాగం లో దీక్షితార్ కీర్తన` వాతాపి గణపతిం భజేహం ' 'త్యాగరాజ కీర్తన `రఘునాయక నీ పాద యుగ రాజీవము నే విడజాలానురా ',పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కీర్తన వినాయకా నిను వినా బ్రోచుటకు'కూడా ప్రసిద్ధి చెందాయి.
వాతాపి గణపతింభజే హం' కీర్తన జన సామాన్యంలోకి తీసుకు వెళ్ళిన ఘనత ఘటసాలగారిదే! తేలికైన పద్ధతిలో అందరూ పాడుకునేలా ఎక్కువ సంగతులు లేకుండా పాడి ఈ కీర్తనని ఎంతగా పొపులర్ చేసారంటే ఇప్పటికీ ఏ కార్యం ప్రారంభించాలన్నా గణపతి ప్రార్ధనా శ్లోకం `శుక్లాంబరధరం విష్ణుం.....',`వాతాపిగణపతిం భజే' కీర్తనలతో ప్రారంభించడం ఒక సంప్రదాయమైపోయింది.
ఈ రాగం భక్తి భావాన్ని వ్యక్తీకరిస్తుంది.కానీ చలన చిత్రసంగీతం లో ప్రయోగాత్మకంగా,జావళీలు,సోలో లు, యుగళ గీతాలు కూడా స్వరపరచారు.
హంసధ్వని రాగం లో దీక్షితార్ కీర్తన` వాతాపి గణపతిం భజేహం ' 'త్యాగరాజ కీర్తన `రఘునాయక నీ పాద యుగ రాజీవము నే విడజాలానురా ',పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కీర్తన వినాయకా నిను వినా బ్రోచుటకు'కూడా ప్రసిద్ధి చెందాయి.
వాతాపి గణపతింభజే హం' కీర్తన జన సామాన్యంలోకి తీసుకు వెళ్ళిన ఘనత ఘటసాలగారిదే! తేలికైన పద్ధతిలో అందరూ పాడుకునేలా ఎక్కువ సంగతులు లేకుండా పాడి ఈ కీర్తనని ఎంతగా పొపులర్ చేసారంటే ఇప్పటికీ ఏ కార్యం ప్రారంభించాలన్నా గణపతి ప్రార్ధనా శ్లోకం `శుక్లాంబరధరం విష్ణుం.....',`వాతాపిగణపతిం భజే' కీర్తనలతో ప్రారంభించడం ఒక సంప్రదాయమైపోయింది.
శ్రీ రఘురాం జయరఘురాం ,తరలిరాద తనే వసంతం పాటలలో అన్య స్వరాల ని ప్రయోగించడం వల్ల ఈ పాటలు హంస్వధ్వని రాగం ఆధారంగా స్వరపరచబడిన పాటలుగా ఉదహరించడమే తప్ప సంపూర్ణంగా హంస్వధ్వని రాగంలో లో స్వరపరచిన పాటలుగా చెప్పలేం.
ఇటీవల వెలుగులోకి వచ్చిన 12 వ శతాబ్దపు వాగ్గేయకారుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు (క్రిష్ణమయ్య ) కీర్తన శ్రీ.వినుకొండ మురళి మోహన్ స్వరపరచిన` షోడస కళా పరిపూర్ణ నమో '
` మధురిమ'
Subscribe to:
Posts (Atom)