(ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక,ఆంధ్రజ్యోతి దినపత్రిక లలో నేను నిర్వహించిన 'రంజని' 'కళా జ్యోతి ' సాంస్కృతిక పేజీ లలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ వ్యాసాలు) ఈ వ్యాసాలు ప్రచురించిన మంగు రాజ గోపాల రావు ,నండూరి రామ మోహన రావు గారికి ,నా కు సహకరించిన నా శ్రీమతి శ్రీ సుశీలకి క్ర్రుతజ్ఞతలు )
(కల్యాణి /యమన్ రాగం గురించి రాజ రామ వర్మ గారి వివరణ) భారతీయ సంగీతంలో అతి ప్రాచీనమైనదీ ,విస్తృత ప్రచారంలో
ఉన్నఅందమైన,అపురూపమైన రాగం కల్యాణి'. మన
రాగాలలో `దర్బారీ కానడ'ని ``King of Raagaas'' అనీ ,`కల్యాణి' రాగాన్ని
`Queen of Raagaas'' అనీ వ్యవహరిస్తారు .మాధుర్యానికి మరోపేరు
కల్యాణి.అందుకే బాలమురళీకృష్ణ ఆయన స్వీయ రచన` ఓ కల్యాణి రాగిణీ' లో
మాధుర్యం నీ సొత్తు అని పొగుడుతారు..హిందుస్తానీ సంగీత పధ్ధతి లో కల్యాణి
స్త్రీ రాగం అంటే రాగిణి .(పురుష రాగాలని `రాగ' అని స్త్రీ రాగాలని `రాగిణి
'గా వ్యవహరిస్తారు).
ప్రాధమిక
రాగాలలో (Primordial Scales ) ఒకటైన ఈ రాగం `ఖరహరప్రియ 'రాగం లో గాంధార
స్వరం గ్రహ బేధం (మోడల్ షిఫ్టింగ్ )చేస్తే కల్యాణి రాగం
ఏర్పడుతుంది.ఔత్తరాహిక సంగీతం ( హిందూస్తానీ పధ్ధతి) లో ఈ
రాగాన్ని`కల్యాణ్' (థాట్) అని వ్యవహరిస్తారు.ఈ రాగం దక్షిణాది సంగీత
సంప్రదాయం లోను, ఉత్తరాది సంగీత సంప్రదాయం లోను ,రవీంద్ర సంగీతం లోను
,హిందీ,తెలుగు,తమిళ,కన్నడ,మలయాళీ,బెంగాలీ మొదలైన చలన చిత్రసంగీతం లోను
,లలిత,లలిత శాస్త్రీయ సంగీతం లోను(classical,light classical) బాగా
ప్రాచుర్యం పొందింది.పాట పాడే వాళ్లకి ,వాద్య సంగీతం వాయించే
వాలకి,స్వరకర్తలకి అత్యంత ప్రీతి కరమైన రాగం.ఈ రాగాన్ని `composers`
choice'అని వ్యవహరిస్తారు . కల్యాణి రాగం సంపూర్ణ రాగం (Septa tonic scale ).అంటే ఇందులో షడ్జమం
,చతుశ్రుతి రిషభం,అంతర గాంధారం ,ప్రతి మధ్యమం,పంచమం,చతుశ్రుతి దైవతం,కైశికి
నిషాదం షడ్జమం అనే ఏడు స్వరాలు ఉంటాయి .ఇవన్నీ తీవ్ర స్వరాలు(షార్ప్
నోట్స్) .అందువల్లే ఈ రాగం వినటానికి శ్రావ్యంగా,హాయిగా వుంది మనసును
త్వరితం గా రంజింప చేస్తుంది..ఈ రాగం కీర్తనలు,కృతులుతిల్లాన లు
,జావళీలు,పదాలు శ్లోకాలు,పద్యాలు,దండకాలు,భక్తిగీతాలు,భజనలు
గజళ్ళు,శృంగార గీతాలు ఎలా అన్నీ రకాల సంగీత ప్రక్రియలకీ అనువైన రాగం.చలన
చిత్రసంగీతంలో 1950 నుండి 1980 వరకు వచ్చిన చిత్రాలన్నింటిలోనూ ఈ రాగం
వినిపించేది.
ఈ రాగం లో చలన చిత్రాల వల్ల బాగా ప్రాచుర్యం
పొందిన త్యాగ రాజ కీర్తనలు `నిధి చాలా సుఖమా'(ఈ కీర్తనని నాగయ్య
`త్యాగయ్య' చిత్రంలో పాడారు) ,ఏ తావునరా..నిలకడ నీకు' (ఈ కీర్తనని వరుడు
కావాలి లో భానుమతి పాడారు). సినిమాలలో మన సంగీత దర్శకులు అద్భుత మైన ప్రయోగాలు చేసి అన్నీ రకాల
భావాలూ ఈ రాగంలో పలికించి ఈ రాగం యొక్క బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరింప
చేసేరు. ఈ రాగంలో స్వరపరచిన భక్తీ గీతాలు:
పాల కడలిపై శేషతల్పమున (భక్త ప్రహ్లాద -రాజేశ్వర రావు-సుశీల) శ్రీ రామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి (పి.సుశీల)
మది శారదా దేవి మందిరమే (జయ భేరి -పెండ్యాల -ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,రఘునాథ్ పాణిగ్రాహి)
దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం-మహదేవన్-ఎస్.పి.బాలు)
సకల జగన్నివాసుడవు (క్రిష్ణమయ్య కీర్తన ) ని భిన్నమైన శైలిలో శ్రీ సుశీల స్వరపరచిన ది
జగమే మారినది మధురముగా ఈవేళా...(దేశ ద్రోహులు-సాలూరు రాజేశ్వర రావు -ఘంటసాల,సుశీల)
మధుర భావాల సుమమాల (జైజవాన్-సాలూరు రాజేస్వ్వర'` రావు -ఘంటసాల -సుశీల) చక్కని వాద్య గోష్టి తో ,మధురమైన కల్యాణి రాగంలో ఒక నిత్యవసంత గీతం ఇది.
చిగురులు వేసిన కలలన్ని (పూలరంగడు - రాజేశ్వర రావు-జయదేఅవ్,సుశీల)
తోటలో నారాజు తొంగి చూసెను నాడు (ఏకవీర -మహదేవన్-ఘంటసాల,సుశీల)
This is an exemplary composition of Dr.Saluru Rajeswara rao garu in Rag Yaman/Kalyani which depicts a new facet of Rag Yaman using rare phrases .This is duet originally rendered by Ghantasala and suseela ,now sung by Murali mohan for this vedio.
హిందీ చిత్రాలలో యమన్/కల్యాణ్ 0రాగం లో బాగా పొపులర్ అయిన పాటలు :
జియలేగాయోజి మోర్ సావరియన్ (అన్ పద్-మదన్మోహన్-లత) తుమ్బిన్ జీవన్ కైసే బీతాన్ (అనిత-లక్ష్మికాంట్ ,ప్యారేలాల్ -ముకేష్) (an excellent song from the composition and rendering view point)
దో సితారోంక జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కి రాత్ (కోహినూర్-నౌషాద్-రఫీ,లత)
ముసం హాయ్ ఆశికానా (పాకీజా -గులాం అలీ-లతా)(a song composed in typical Pursian style of rag yaman)
చందన్ స బదన్ చంచల్ చిత్ వన్ (సరస్వతి చంద్ర -కల్యాణ్ జి ,ఆనంద్ జి - ముకేష్-మురళీమోహన్ గాత్రంలో) ఘజల్:
జిందగీ భర్ నహి భూలేగి ఓ బర్సాత్ కి రాత్ ( -బర్సాత్ కి రాత్-రవి -రఫీ -మురళీమోహన్ గాత్రంలో)
రంజిష్ హీ సహీ దిల్హి దుఖానే కే లీయే ఆ (ప్రఖ్యాత ఘజల్ గాయకుడు పాడిన ఒక మంచి ఘజల్) (a Gajal composed in typical pursianstyle of ragYaman) విషాద గీతాలు :
మధ్యమ
,నిషాద స్వరాలకి ప్రాధాన్యత ఇస్తూ కంపిత స్వరాలుగా ప్రయోగించడం ద్వారా
,పంచమ ,షడ్జమాలని కొద్దిగా స్ప్రుసించడం ద్వారా కల్యాణి రాగంలో విషాద చాయలు
కల్పించవచ్చని పెద్దలు చెప్తారు.
ముఖేష్ స్లో టెంపో లో పాడిన `అంసూ భరీ హాయ్ '(పర్వరిష్-దత్తరాం),భూలీ
హుయి యాదే ( సంజోగ్ -మదన్
మోహన్ ).ఈ రెండు పాటలూ మంచి` కల్యాణి 'కి
ఉదాహరణలు. పెను చీకటాయే లోకం (మాంగల్య బలం -మాస్టర్ వేణు-ఘంటసాల )
కామెడీ సాంగ్ : మై తేరే ప్యార్ క బీమార్ హూన్ క్యా అర్జ్ కరూన్ (లవ్ ఇన్ టోక్యో -శంకర్ జైకిషన్ -మన్నా డే)
దండకం: మాణిక్య వీణాం ఉపలాలయన్తీం (sankaraabharanam) పద్యం : రంగారు బంగారు (లవకుశ-సంగీతం ,గానం -ఘంటసాల) ఈ పద్యం మంచి కల్యాణి కి ఉదాహరణ గా పేర్కొనవచ్చు
`సింధుభైరవి 'చిత్రం కోసం ఇలయ రాజా ప్రయోగాత్మకంగా ఒక్క ఆరోహణ స్వరాలనే ఉపయోగిస్తూ ` కల్యాణ యే''అనే ఒక చక్కని మెలోడి ని ఇచ్చారు
.సుప్రసిద్ధమైన ఒక ఇంగ్లీష్ పాటని తీసుకుని దానిని కల్యాణి రాగం లో స్వరబద్ధం చేసి రాక్,జాజ్ మిళితం చేసి మురళి కృష్ణ ప్రయోగాత్మకంగా రికార్డు చేసిన పాట ఇది
Dear murali garu, In 80's and 90's-I was regular reader of your RAGA RANJANI published in ANDHRA BHOOMI Daily. I am very happy to hear and see the beautiful analytical work of you on Raag YAMAN KALYANI. This will be very useful and helpful to amateurs and learners. We are expecting your works inform of BOOK.Thank you. -vijayakumarballa
Dear murali garu, In 80's and 90's-I was regular reader of your RAGA RANJANI published in ANDHRA BHOOMI Daily. I am very happy to hear and see the beautiful analytical work of you on Raag YAMAN KALYANI. This will be very useful and helpful to amateurs and learners. We are expecting your works inform of BOOK.Thank you. -vijayakumarballa
ReplyDeleteమంచి వివరణ
ReplyDelete