Thursday, March 15, 2012

`Queen of Raagaas'' ,`కల్యాణి'



కల్యాణి          (యమన్)రాగరంజని
                           
(ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక,ఆంధ్రజ్యోతి దినపత్రిక లలో  నేను నిర్వహించిన 'రంజని' 'కళా జ్యోతి ' సాంస్కృతిక పేజీ లలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ వ్యాసాలు)
ఈ  వ్యాసాలు ప్రచురించిన మంగు రాజ గోపాల రావు ,నండూరి రామ మోహన రావు గారికి ,నా కు సహకరించిన నా శ్రీమతి శ్రీ సుశీలకి క్ర్రుతజ్ఞతలు )

                                   (కల్యాణి /యమన్ రాగం గురించి రాజ రామ వర్మ గారి వివరణ)                                        
 భారతీయ సంగీతంలో అతి ప్రాచీనమైనదీ ,విస్తృత ప్రచారంలో ఉన్నఅందమైన,అపురూపమైన రాగం కల్యాణి'.  మన రాగాలలో `దర్బారీ కానడ'ని ``King of Raagaas'' అనీ ,`కల్యాణి' రాగాన్ని `Queen of Raagaas'' అనీ వ్యవహరిస్తారు .మాధుర్యానికి మరోపేరు కల్యాణి.అందుకే బాలమురళీకృష్ణ  ఆయన స్వీయ రచన` ఓ కల్యాణి రాగిణీ' లో మాధుర్యం నీ సొత్తు అని పొగుడుతారు..హిందుస్తానీ సంగీత పధ్ధతి లో కల్యాణి స్త్రీ రాగం అంటే రాగిణి .(పురుష రాగాలని `రాగ' అని స్త్రీ రాగాలని `రాగిణి 'గా వ్యవహరిస్తారు).
                   ప్రాధమిక రాగాలలో (Primordial Scales ) ఒకటైన ఈ రాగం `ఖరహరప్రియ 'రాగం లో గాంధార స్వరం గ్రహ బేధం (మోడల్ షిఫ్టింగ్ )చేస్తే కల్యాణి రాగం ఏర్పడుతుంది.ఔత్తరాహిక సంగీతం ( హిందూస్తానీ పధ్ధతి) లో ఈ రాగాన్ని`కల్యాణ్' (థాట్) అని వ్యవహరిస్తారు.ఈ రాగం దక్షిణాది సంగీత  సంప్రదాయం లోను, ఉత్తరాది సంగీత సంప్రదాయం లోను ,రవీంద్ర సంగీతం లోను ,హిందీ,తెలుగు,తమిళ,కన్నడ,మలయాళీ,బెంగాలీ మొదలైన చలన చిత్రసంగీతం లోను ,లలిత,లలిత శాస్త్రీయ సంగీతం లోను(classical,light classical) బాగా ప్రాచుర్యం పొందింది.పాట పాడే వాళ్లకి ,వాద్య సంగీతం వాయించే వాలకి,స్వరకర్తలకి అత్యంత ప్రీతి కరమైన రాగం.ఈ రాగాన్ని `composers` choice'అని వ్యవహరిస్తారు .
కల్యాణి రాగం సంపూర్ణ రాగం (Septa tonic scale ).అంటే ఇందులో షడ్జమం ,చతుశ్రుతి రిషభం,అంతర గాంధారం ,ప్రతి మధ్యమం,పంచమం,చతుశ్రుతి దైవతం,కైశికి నిషాదం షడ్జమం అనే ఏడు స్వరాలు ఉంటాయి .ఇవన్నీ తీవ్ర స్వరాలు(షార్ప్ నోట్స్) .అందువల్లే ఈ రాగం వినటానికి  శ్రావ్యంగా,హాయిగా వుంది  మనసును త్వరితం గా రంజింప చేస్తుంది..ఈ రాగం కీర్తనలు,కృతులుతిల్లాన లు ,జావళీలు,పదాలు శ్లోకాలు,పద్యాలు,దండకాలు,భక్తిగీతాలు,భజనలు గజళ్ళు,శృంగార గీతాలు ఎలా అన్నీ రకాల సంగీత ప్రక్రియలకీ అనువైన రాగం.చలన చిత్రసంగీతంలో 1950  నుండి 1980 వరకు వచ్చిన చిత్రాలన్నింటిలోనూ ఈ రాగం వినిపించేది.


                     ఈ రాగం లో చలన చిత్రాల వల్ల  బాగా ప్రాచుర్యం పొందిన త్యాగ రాజ కీర్తనలు `నిధి చాలా సుఖమా'(ఈ  కీర్తనని  నాగయ్య `త్యాగయ్య' చిత్రంలో పాడారు)  ,ఏ తావునరా..నిలకడ నీకు'  (ఈ కీర్తనని  వరుడు కావాలి  లో భానుమతి పాడారు).
 సినిమాలలో మన సంగీత దర్శకులు అద్భుత మైన ప్రయోగాలు చేసి అన్నీ రకాల భావాలూ ఈ రాగంలో పలికించి ఈ రాగం యొక్క బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరింప చేసేరు.
ఈ రాగంలో స్వరపరచిన భక్తీ గీతాలు:
పాల కడలిపై శేషతల్పమున (భక్త ప్రహ్లాద -రాజేశ్వర రావు-సుశీల)
శ్రీ రామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి (పి.సుశీల)
మది శారదా దేవి మందిరమే (జయ భేరి -పెండ్యాల -ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,రఘునాథ్ పాణిగ్రాహి)

దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం-మహదేవన్-ఎస్.పి.బాలు)   





సకల జగన్నివాసుడవు (క్రిష్ణమయ్య కీర్తన )  ని భిన్నమైన శైలిలో  శ్రీ సుశీల స్వరపరచిన ది 

 అనుజుడై లక్ష్మణుడు (స్వరాభిషేకం-విద్యాసాగర్-ఏసుదాస్)

 తులసీదాస్ భజన్ :
Sree Raama chandra kriered paalu bhaju manaharana bhava bhaya daarunam
music composed and rendered by Vinukonda Mrali




త్యాగయ్య కీర్తన `మోక్షముగలదా' (స్వరకల్పన,గానం :వినుకొండ మురళి)
శృంగార గీతాలు :
రారా నా స్వామి రారా (విప్రనారాయణ-క్షేత్రయ్య పదం-సంగీతం సాలూరు రాజేశ్వర రావు -భానుమతి)
సా విరహే తవ దీనా రాధా (విప్రనారాయణ-జయదేవకవి అష్టపది -సంగీతం సాలూరు రాజేశ్వర రావు -భానుమతి)

నాట్య గీతాలు:
సలలిత రాగ సుధా రస సారం (నర్తన శాల-సుసర్ల దక్షిణామూర్తి -బెంగుళూరు లత,బాలమురళి కృష్ణ)
జోలపాట :
మెల్ల మెల్లగా చల్ల చల్ల గా రావే నిదురా హాయిగా (చక్రపాణి -భానుమతి )



భావగీతాలు :మనసునమల్లెల మాల లూగెనే (మల్లేశ్వరి -సాలూరు రాజేశ్వర రావు- భానుమతి) 
కుడి ఎడమైతే  పొరపాటు లేదోయ్ (దేవదాసు-సుబ్బరామన్-ఘటసాల)
పెళ్ళిచేసుకుని ఇల్లుకట్టుకుని (పెళ్ళిచేసిచూడు -సంగీతం ,గానం :ఘంటసాల)
పలుకరాదటే చిలుకా (షావుకారు -సంగీతం ,గానం:ఘంటసాల )
(స్వచ్చమైన కల్యాణి కి ఒక మంచి ఉదాహరణ )

రావే నా చెలియా (మంచి మనసుకు మంచి రోజుల్లు - సంగీతం,గానం :ఘంటసాల )(స్వచ్చమైన కల్యాణి కి ఒక మంచి ఉదాహరణ )
చల్లని వెన్నెల లో చక్కని కన్నె సమీపంలో (సంతానం -సుసర్ల దక్షిణా మూర్తి -ఘంటసాల

ఎవరివో నీవెవరివో (పునర్జన్మ-టి.వి.చలపతి రావు -ఘంటసాల) 

బహుదూరపు బాటసారి (ప్రైవేటు రికార్డు -సగీతం,గానం :ఘంటసాల )
జోరు మీదున్నావు తుమ్మెదా (కల్యాణి -రమేష్ నాయుడు-సుశీల)
(మంచి కళ్యాణికి ఒక చక్కని ఉదాహరణ )
నవ రాగానికే నడకలు వచ్చేనూ కల్యాణి -రమేష్ నాయుడు -బాలు,సుశీల)
 (మంచి కళ్యాణికి ఒక చక్కని ఉదాహరణ )

మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన (
యుగళ గీతాలు:
మనసులోని కోరికా తెలుసు ప్రేమ మాలికా (భీష్మ -సాలూరు రాజేశ్వర రావు -పి.బి.శ్రీనివాస్ -సుశీల)
నాదు ప్రేమ భాగ్య రాసి నీవే ప్రేయసి(భక్త జయదేవ -సాలూరు రాజేశ్వర రావు-ఘంటసాల ,సుశీల)

కిల కిల నవ్వులు కురియగా (చదువుకున్న అమ్మాయిలు--సాలూరు రాజేశ్వర రావు-ఘంటసాల,సుశీల) 
చెలికాడు నిన్నే రమ్మని పిలువా (కులగోత్రాలు -సాలూరు రాజేశ్వర రావు -ఘటసాల,సుశీల)


జగమే మారినది మధురముగా ఈవేళా...(దేశ ద్రోహులు-సాలూరు రాజేశ్వర రావు -ఘంటసాల,సుశీల) 

మధుర భావాల సుమమాల (జైజవాన్-సాలూరు రాజేస్వ్వర'` రావు -ఘంటసాల -సుశీల)
చక్కని వాద్య గోష్టి తో ,మధురమైన కల్యాణి రాగంలో ఒక నిత్యవసంత గీతం ఇది.
చిగురులు వేసిన కలలన్ని (పూలరంగడు - రాజేశ్వర రావు-జయదేఅవ్,సుశీల)

తోటలో నారాజు తొంగి చూసెను నాడు (ఏకవీర -మహదేవన్-ఘంటసాల,సుశీల)
This is an exemplary composition of Dr.Saluru Rajeswara rao garu in Rag Yaman/Kalyani which depicts a new facet of Rag Yaman using rare phrases .This is duet originally rendered by Ghantasala and suseela ,now sung by Murali mohan for this vedio.


 హిందీ చిత్రాలలో యమన్/కల్యాణ్ 0రాగం లో బాగా పొపులర్ అయిన పాటలు :


 జియలేగాయోజి మోర్ సావరియన్ (అన్ పద్-మదన్మోహన్-లత)
 తుమ్బిన్ జీవన్ కైసే బీతాన్   (అనిత-లక్ష్మికాంట్ ,ప్యారేలాల్ -ముకేష్)
 (an excellent song from the composition and rendering view point)


దో సితారోంక జమీన్ పర్ హై  మిలన్ ఆజ్ కి రాత్ (కోహినూర్-నౌషాద్-రఫీ,లత)


సౌసాల్ పహేలే ముజ్హే తుమ్సే ప్యార్ తా (జబ్ ప్యార్ కిసిసే  హోతాహై -శంకర్ జైకిషన్ -రఫీ,లత)


బీతీన   బీతా యే రైనా బిర్హా    సే హోతే నైనా (పరిచయ్-అర.డి.బర్మన్ -లత,భూపేంద్ర)
నాం గూం  జాఏగా ,చెహ్ర ఏ బదల్   జాఏగా (కినారా-అర.డి.బర్మన్ -లత,భూపేంద్ర)

దిలే బెతాబ్ కో సీనేసే లగానా హోగా (పాల్కి-నౌషాద్ -రఫీ,సుమన్ కల్యాన్పుర్)
రే మన్ సుర్ మే గా (లాల్ పతర్-శంకర్ జైకిషన్ -మన్నా డే)
(స్వచ్చమైన కల్యాణి రాగానికి ఒక మంచి ఉదాహరణ)
ఇస్ మోడ్ పే  జాతే హై(అంది-ఆర్.డి.బర్మన్ -కిశోరే -లత )
 

ముసం హాయ్ ఆశికానా (పాకీజా -గులాం అలీ-లతా)(a song composed in typical Pursian style of rag yaman)

చందన్ స బదన్ చంచల్ చిత్ వన్ (సరస్వతి చంద్ర -కల్యాణ్ జి ,ఆనంద్ జి -   ముకేష్-మురళీమోహన్ గాత్రంలో)
ఘజల్:
జిందగీ భర్ నహి భూలేగి ఓ బర్సాత్ కి రాత్ ( -బర్సాత్ కి రాత్-రవి -రఫీ -మురళీమోహన్ గాత్రంలో)
రంజిష్ హీ సహీ దిల్హి దుఖానే కే లీయే ఆ  (ప్రఖ్యాత ఘజల్ గాయకుడు పాడిన ఒక మంచి ఘజల్)
(a Gajal composed in typical pursianstyle of ragYaman)
విషాద గీతాలు :
మధ్యమ ,నిషాద స్వరాలకి ప్రాధాన్యత ఇస్తూ కంపిత స్వరాలుగా ప్రయోగించడం ద్వారా ,పంచమ ,షడ్జమాలని కొద్దిగా స్ప్రుసించడం ద్వారా కల్యాణి రాగంలో విషాద చాయలు కల్పించవచ్చని పెద్దలు  చెప్తారు.
ముఖేష్ స్లో టెంపో లో పాడిన `అంసూ భరీ హాయ్ '(పర్వరిష్-దత్తరాం),భూలీ హుయి యాదే (     సంజోగ్ -మదన్

మోహన్ ).ఈ రెండు పాటలూ మంచి` కల్యాణి 'కి ఉదాహరణలు.
 పెను చీకటాయే లోకం (మాంగల్య బలం -మాస్టర్ వేణు-ఘంటసాల )
కామెడీ సాంగ్ :
మై తేరే ప్యార్ క  బీమార్ హూన్ క్యా అర్జ్ కరూన్ (లవ్ ఇన్ టోక్యో -శంకర్ జైకిషన్ -మన్నా డే)
 దండకం:
 మాణిక్య వీణాం ఉపలాలయన్తీం (sankaraabharanam)
 పద్యం :
రంగారు బంగారు (లవకుశ-సంగీతం ,గానం -ఘంటసాల) ఈ పద్యం మంచి కల్యాణి కి ఉదాహరణ గా పేర్కొనవచ్చు

 `సింధుభైరవి 'చిత్రం కోసం ఇలయ రాజా ప్రయోగాత్మకంగా  ఒక్క  ఆరోహణ స్వరాలనే ఉపయోగిస్తూ ` కల్యాణ యే''అనే  ఒక చక్కని మెలోడి ని ఇచ్చారు
 .సుప్రసిద్ధమైన ఒక ఇంగ్లీష్ పాటని తీసుకుని దానిని కల్యాణి రాగం లో స్వరబద్ధం చేసి రాక్,జాజ్ మిళితం చేసి మురళి కృష్ణ ప్రయోగాత్మకంగా రికార్డు చేసిన పాట ఇది 

   


Sunday, March 11, 2012

సినీ సరిగమలు - హంసధ్వని -hamsadhwani


రాగరంజని
                                           హంసధ్వని  
(ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రభూమి వారపత్రిక,ఆంధ్రజ్యోతి దినపత్రిక లలో  నేను నిర్వహిచిన సాంస్కృతిక పేజీలు 'రంజని'.'కళాజ్యోతి ' లలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ వ్యాసాలు.ఈ వ్యాసం ప్రచురించిన మంగు రాజగోపాల్ ,నండూరి రామ మోహన రావు గారు,సహకారం అందించిన నా శ్రీమతి శ్రీ సుశీలకి కృతజ్ఞతలు )
     ప్రపంచ సంగీత సంప్రదాయాలన్నింటి లోనూ  భారతీయ సంగీతం చాలా విశిష్టమైంది.మనకున్న రాగసంపదే ఆ విశిష్టత  కి కారణం .మన సంగీతానికి ఆత్మ రాగాలే!
               మనకి కలిగే సంతోషం,దుఖం బాధ,జాలి,విచారం ఇలా అన్నిమూడ్స్ వ్యక్తం చేయడానికి మన సంగీతం లో రాగాలు ఉన్నాయి.మనం వినే ప్రతీ సంగీత ప్రక్రియ శాస్త్రీయ సంగీతం కానీ ,సినీమా పాట గానీ ఏదో ఒక రాగం పై ఆధారపడి వుంటుంది.`గురు లేక ఎటువంటి గుణికి తెలియగ బోదు 'అనే త్యాగరాజ కీర్తనకి,`ఎదుట నీవే !ఎదలోన నీవే ' అనే సినిమాపాటకి ఆధారం `గౌరీ మనోహరి'అనే సంప్రాదాయిక రాగం అంటే మనకి ఆశ్చర్యం గా వుంటుంది.అంతెందుకు `రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ'అనే కీర్తన కీ` యమహా నగరి కలకత్తా పురీ'
అనే సినీమా పాటకీ ఆధారం `కదన కుతూహలం 'అనే రాగం ఆధారం.
                 ఇలా మనకి తెలిసిన ప్రతి సంప్రదాయిక సంగీత రచన,,సినిమా పాటా ఏదో ఒక రాగంపైన ఆధారపడి వుంటుంది.మనకి తెలియకుండానే ఎన్నో సంప్రదాయిక  రాగాలు మనకి కీర్తనల ద్వారా సినిమా  పాటల ద్వారా పరిచయమయ్యే వుంటాయి.
మ వాగ్గేయ కారులు,న చలన చిత్ర సంగీత దర్శకులు వారి మేధస్సుతో,సృజనాత్మకతని జోడించి  సంప్రదాయిక రాగాలలో ఎన్నో మంచి మంచి,కీర్తనలు పాటలు సృష్టించి సంప్రదాయిక రాగాల బహుముఖ సౌందర్యాలని ఆవిష్కరించారు.అంతే కాదు ఎన్నెన్నో ప్రయోగాలు  చేసి వాటికి  కొత్త రూపాలిచ్చారు.
         ఎక్కువ లోతులకి పోకుండా మన సంప్రదాయిక సంగీత రచనల్లో, సినిమా పాటలలో సంప్రదాయిక రాగాలగురించి చర్చించుకోవడమే  ఈ శీర్షిక లక్ష్యం.

                                                    హంసధ్వని 
మన  భారతీయ సంగీతంలో ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క స్వభావం వుంది .ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూడ్ ని  సూచిస్తుంది .ఉదాహరణకి 'భూపాలం'ఉదయరాగం కావటంవల్ల సూర్యోదయాన్నిఆ రాగం సూచిస్తుంది .అలాగే హంసధ్వని   రాగం ప్రారంభాన్ని సూచిస్తుంది .రాగల స్వభావాలని ,మూడ్స్ ని బట్టి ఆయా రాగాలలో పాటలని స్వరపరచే ఆచారంమనకి అనాదిగా వస్తోంది .
             .దక్షిణాదిలోశాస్త్రీయ సంగీత కచేరీలని' హంసధ్వని'రాగంతో ప్రారంభించే   ఆచారం వుంది.      


(హంసధ్వని రాగం హిందుస్తానీ పధ్ధతి వాతాపిగణపతిం భజే హం కీర్తన)



                                   (హంసధ్వని రాగం హిందుస్తానీ పద్ధతిలో)
ఈ రాగం ఆధునిక రాగాలకోవకి చెందినది .ముత్తుస్వామి దీక్షి తార్'తండ్రి రామస్వామి ఈ రాగాన్ని సృష్టించారని  చెపుతారు .ప్రాచీన గ్రంధాలలో' హంసధ్వని ' రాగం గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు  కనిపించదు.పర్షియా సంగీత సంప్రదాయానికి  చెందిన రాగాన్నిరామ స్వామి దీక్షితార్ అడాప్ట్ చేసుకుని దక్షిణాది సంగీత సంప్రదాయానికి చెందిన ఇడియంస్  ,ఫ్రేజెస్ తో కీర్తనలని పాడారని చెపుతారు. హిందుస్థానీ సంగీతంలో  హంసధ్వని ని పోలిన  రాగం లేదు.దక్షిణాది లో  పాడుతోన్న రాగాన్నే బండి బజార్  ఘరానా కి చెందిని ఉస్తాద్  అమన్ ఆలీఖాన్ ఉత్తరాది లో బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు                         .  
                         హంసధ్వని రాగం 29 వ మేళకర్త ధీర శంకరాభరణం జన్యం ఇది ఔఢవ -ఔఢవ జాతికి చెందినది అంటే ఈ రాగం ఆరోహణ లోను అవరోహణ లోనూ ఐదేసి స్వరాలుంటాయి.
ఆరోహణ: స-రి-గ-ప-ని-స (షడ్జమం-చతుసృతి రిషభం-అంతర గాంధారం-పంచమం-కైసికి నిషాదం-షడ్జమం)
అవరోహణ: స-ని-ప-గ-రి-స (షడ్జమం-చతుసృతి రిషభం-అంతర గాంధారం-పంచమం-కైసికి నిషాదం-షడ్జమం)
ఈ రాగం భక్తి భావాన్ని వ్యక్తీకరిస్తుంది.కానీ చలన చిత్రసంగీతం లో ప్రయోగాత్మకంగా,జావళీలు,సోలో లు, యుగళ గీతాలు కూడా స్వరపరచారు.
                   హంసధ్వని రాగం లో దీక్షితార్ కీర్తన` వాతాపి గణపతిం భజేహం '  'త్యాగరాజ కీర్తన `రఘునాయక నీ పాద యుగ  రాజీవము నే విడజాలానురా ',పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కీర్తన వినాయకా నిను వినా బ్రోచుటకు'కూడా ప్రసిద్ధి చెందాయి.
 వాతాపి గణపతింభజే హం' కీర్తన జన సామాన్యంలోకి తీసుకు వెళ్ళిన ఘనత  ఘటసాలగారిదే! తేలికైన పద్ధతిలో అందరూ పాడుకునేలా ఎక్కువ సంగతులు లేకుండా పాడి ఈ కీర్తనని ఎంతగా పొపులర్ చేసారంటే ఇప్పటికీ ఏ కార్యం ప్రారంభించాలన్నా గణపతి ప్రార్ధనా శ్లోకం `శుక్లాంబరధరం విష్ణుం.....',`వాతాపిగణపతిం భజే' కీర్తనలతో ప్రారంభించడం ఒక సంప్రదాయమైపోయింది. 
ఈ కీర్తన ప్రభావం హిందీ చలన చిత్ర సంగీతం లో కూడాకనిపిస్తుందిప్రఖ్యాత సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ వాతాపి కీర్తనని యదా తధంగా  అడాప్ట్ చేసుకుని  `పరిహార్ 'అనే చిత్రం లో `జా తోసే  నహి బోలు కన్హయ్య 'అనే పాట  లత,మన్నా డే ల చేత పాడించేరు


                 సి.రామచంద్ర సంగీత దర్సకత్వంలో` శారద' చిత్రంకోసం లత పాడిన` ఓ చాంద్ జహాన్ వొహ్ జాయే' ,హృదయనాథ్ మంగేష్కర్ స్వర రచనలో లత పాడిన `కరం కి గతి న్యారి'  కూడా  హంసధ్వని ఆధారం గా స్వరపరచిన మంచి పాటలు.
 సంత్.తులసీ దాస్ గణపతి ని స్తుతిస్తూ రచించిన ఒక భజన 'గాయియే గణపతి జగ్ వందన్ ( స్వరరచన :శ్రీ.వినుకొండ మురళి మోహన్ ,గానం :ధనంజయ్)
                       తెలుగు చలన చిత్రసంగీతంలో బహుళ ప్రజాదరణ పొందిన పాటలు `శ్రీ రఘురాం జయ రఘు రాం '(శాంతినివాసం చిత్రం కోసం ఘంటసాల సంగీత దర్సకత్వంలో పి.బి .శ్ర్రేనివాస్ పాడినపాట) ఈ పాటకి ముందర పాడే ఆది శంకరాచార్యుల వారి  శ్లోకం `శ్రీ రామ చంద్రహ ఆశ్రిత పారిజాతః .....'కూడా హంసధ్వని రాగమే. ,స్వాగతం సుస్వాగతం నృత్య గీతం ( శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం కోసం టి.వి.రాజు స్వరపరచగా సుశీల పాడారు)`మనసు దోచే దొరవు నీవే !'( యశోదా కృష్ణ చిత్రం కోసం సాలూరు రాజేశ్వర రావు సంగీత దర్సకత్వంలో లో సుశీల పాడారు)`మౌనం  రాగం మధురం మధురం మధురాక్షరం ( మయూరి -సంగీతం- ఎస్ .పి.బాలు  -డ్యూయెట్  )`,మరుమల్లెలలో ఈ జగమంతా విరియగా '( అమృత -ఏ .ఆర్.రహ్మాన్ )`ఓ సారి నీ చెయ్యే తాకి '( ఈ అబ్బాయి చాలా మంచోడు-కీరవాణి-ఎస్.పి.బాలు,చిత్ర) తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం'(రుద్ర వీణ -ఇళయ రాజా-ఎస్.పి.బాలు)
                   శ్రీ రఘురాం జయరఘురాం ,తరలిరాద తనే వసంతం పాటలలో అన్య స్వరాల ని  ప్రయోగించడం వల్ల  ఈ పాటలు హంస్వధ్వని రాగం ఆధారంగా స్వరపరచబడిన పాటలుగా ఉదహరించడమే తప్ప సంపూర్ణంగా హంస్వధ్వని రాగంలో  లో స్వరపరచిన పాటలుగా చెప్పలేం.


 ఇటీవల వెలుగులోకి వచ్చిన 12  వ శతాబ్దపు వాగ్గేయకారుడు  శ్రీకాంత కృష్ణమాచార్యులు (క్రిష్ణమయ్య ) కీర్తన శ్రీ.వినుకొండ మురళి మోహన్ స్వరపరచిన` షోడస కళా పరిపూర్ణ నమో '

                                                                                                          `                                                                                                  మధురిమ'